Illu illalu pillalu : మిమిక్రీ చేసి ఆటపట్టించిన ప్రేమ.. కొత్త కోడలి బంగారు గాజులు తీసుకుందెవరు!
on Dec 19, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -33 లో..... నర్మద ప్రొద్దునే లేచి తులసి పూజ చేస్తుంది. ఆ తర్వాత రెడీ అవుతుంటే తన గాజులు కన్పించవు.. అదే విషయం సాగర్ ని పిలిచి నా బంగారు గాజులు కన్పించడం లేదని అంటుండగా.. అది రామరాజు విని వేదవతిని పిలుస్తాడు. ఎన్నడూ లేని విధంగా వస్తువులు పోవడమేంటి ఆ పిల్ల బంగారు గాజులు పోయాయట అని రామరాజు అనగానే.. ఇంతవరకు ఈ ఇంట్లో ఒక వస్తువు కూడా పోలేదని వేదవతి అంటుంది.
అప్పుడే రామరాజు పెద్ద కూతురు నిద్ర లేచి వస్తుంది. తన చేతికి గాజులు చూసి అవి నావే అని నర్మద అంటుంది. ఆ గాజులు ఎవరివి అని వేదవతి కామాక్షిని అడుగగా.. తనవే ఆడపడుచు కట్నం ఇవ్వలేదు కదా తేరగా వచ్చేసిందని కామాక్షి అనగానే.. తనవి తనకు ఇచ్చేయ్.. నీకు అలాంటివి తీసుకొని వస్తానని రామరాజు అనగానే కామాక్షి ఇస్తుంది. ఆ తర్వాత వేదవతి పూజ చేసి హారతి ఇస్తుంది. నర్మద సాగర్ లకి ఇవ్వదు. దాంతో సాగర్ కి నర్మద హారతి ఇస్తుంది. రామరాజు మిల్ కి వెళ్తాడు. నన్ను తీసుకొని వెళ్లడం లేదని సాగర్ ఫీల్ అవుతాడు. అయినా వద్దని చెప్పలేదు కదా.. వెళ్ళమంటూ సాగర్ ని పంపిస్తుంది నర్మద.
ఆ తర్వాత ధీరజ్ కి వేదవతి ఫోన్ చేస్తుంది. అయినా ధీరజ్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో వేదవతి బాధపడుతుంది. వేదవతి బాధపడడం నర్మద చూస్తుంది. మరొక వైపు ధీరజ్ గాడు బయట తిరుగుతున్నడని భద్రవతి మేనల్లుడు వచ్చి తనకి చెప్పగానే సంతోషపడుతాడు. ఎందుకిలా చేస్తున్నారు వేదవతి నీ చెల్లెలు అని వాళ్ళ అమ్మ అంటుంది. తరువాయి భాగంలో ధీరజ్ వెనకాల నుండి ప్రేమ వచ్చి రామారాజులాగా మిమిక్రీ చేస్తుంది. దాంతో నన్ను క్షమించండి నాన్న అంటూ ధీరజ్ భయపడతాడు. ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read